కాంతార సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ జోనర్‌లో వరుసపెట్టి అనేక సినిమాలు వస్తున్నాయి. అటువంటిదే వీర చంద్రహాస కూడా. తొలుత కన్నడలో తీసిన ఈ సినిమా ఇప్పటికే వంద రోజులు విజయవంతంగా ఆడింది. కనుక దీనిని తెలుగులో కూడా డబ్ చేసి ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ నేడు విడుదలైంది. కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన ‘యక్షగానం’ కళ ఆధారంగా ఈ సినిమాని తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
రవి బస్రూర్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో షిథిల్ శెట్టి, నాగశ్రీ, ప్రసన్న శేట్టిగర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్; కెమెరా: కిరణ్ కుమార్; ఎడిటింగ్: కార్తిక్, మహేష్ ఎస్ రెడ్డి; ఆర్ట్: ప్రభు బాడ్జియర్ చేశారు.
ఓంకార్ మూవీస్, రవి బస్రూర్ మూవీస్ బ్యానర్లపై ఎన్.ఎస్. రాజ్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈనెల 19న ఈ సినిమా విడుదల కాబోతోంది.