మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి పప్పీ షేమ్ అంటూ సాగే రెండో పాట విడుదలైంది. కానీ ఈ పాట సాహిత్యం, పాట, సంగీతం, డాన్స్ అన్నీ కూడా చాలా చప్పగా ఉన్నాయి.
ఈ పాటని రామ్ పోతినేని, రాహుల్ రామకృష్ణయాల చేత పాడించడం కోసం వారు ఇబ్బంది పడకుండా సులువుగా పాడేందుకు వీలుగా చిన్న చిన్న పదాలతో పాట వ్రాసి స్వరపరిచారు. లిరిక్స్, పాట ఇలా ఉన్నాయి కనుకనే సంగీతం, డాన్స్ కూడా చప్పగా ఉన్నాయి.
భాస్కరభట్ల వ్రాసిన ఈ పాటకి వివేక్, మెర్విన్ సంగీతం అందించగా రామ్ పోతినేని, రాహుల్ రామకృష్ణ, వివేక్ శివ, మెరవీం సోలమన్ కలిసి పాడారు.
1970-80లలో హీరోల అభిమానులు ఏవిదంగా ఉండేవారో తెలియజేస్తూ సాగే “ఓ అభిమాని బయోపిక్ ఇది” అని దర్శకుడు మహేష్ బాపు ముందే చెప్పేశారు.
ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటించగా, సినిమా హీరోగా ఉపేంద్ర నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.