కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందిస్తుందని అందరూ భావిస్తే అసలు ఆ విషయం తెలియనట్లే బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదివరకు ఆమె మొదటిసారి పార్టీపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు.
కవిత తాజా విమర్శలు, ఆరోపణలు, హితోక్తులతో బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత దెబ్బ తింటుంది. ముఖ్యంగా ప్రజలలో హరీష్ రావు పట్ల అపనమ్మకం లేదా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. కనుక కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపడుతారనుకుంటే, కేసీఆర్ వాటిని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆమె ప్రెస్‌మీట్ తర్వాత ఎర్రవెల్లి ఫామ్‌హౌసులో జరిగిన సమావేశంలో పార్టీలో అందరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టిపెట్టి పనిచేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ సమస్యని కేసీఆర్ ఏవిదంగా పరిష్కరించాలనుకుంటున్నారో?