రేపు టీజర్‌ వస్తోంది... తెలుసు కదా?

September 10, 2025


img

సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా జంటగా చేసిన ‘తెలుసు కదా?’ నుంచి ఇటీవల విడుదలైన ‘ఆకాశం అందిందా...నేలంతా నవ్విందా...’ అంటూ సాగే పాటకి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ విడుదలకి ముహూర్తం పెట్టేశారు. గురువారం ఉదయం 11.11 గంటలకు టీజర్‌ విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం:  నీరజ్ కోనా సంగీతం: తమన్, కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవబోతోంది... తెలుసు కదా?


Related Post

సినిమా స‌మీక్ష