సిఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్, కేటీఆర్ చాలా తక్కువ అంచనా వేసి ఎదురు దెబ్బలు తింటున్నారని చెప్పక తప్పదు.
కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించిన రేవంత్ రెడ్డి ఎఫ్-1 రేసింగ్ కేసుని మాత్రం తన వద్దే అట్టే పెట్టుకోవడం ఆయన రాజకీయ చతురతకి మరో నిదర్శనంగా భావించవచ్చు.
ఈ కేసులో ఏసీబీ నివేదికని నేడు గవర్నర్‌కి సమర్పించి ఆయన అనుమతిస్తే ఛార్జ్-షీట్ దాఖలు చేయబోతున్నారు.
కాళేశ్వరం కేసుని అట్టేబెట్టుకొని ఆ కేసులో కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తే ఆయనాకే ప్రజల సానుభూతి లభిస్తుంది. దాని వలన బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా మేలు కలుగుతుంది. కనుక చాలా తెలివిగా ఆ కేసుని సీబీఐకి అప్పగించేశారు. దాంతో బీజేపి, బీఆర్ఎస్ పార్టీలకి అగ్నిపరీక్ష కల్పించారు.
కానీ కేటీఆర్‌ని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా హ్యాండిల్ చేయాలనుకున్నట్లున్నారు. అందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి కేటీఆర్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డికి పాలన చాతకాదని కేటీఆర్ ఈసడించుకుంటున్నారు.
కనుక ఈ కేసుతో కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి ఆయనతో ఓ ఆటాడుకోబోతున్నట్లే ఉన్నారు. ఈ కేసులో ఛార్జ్-షీట్ దాఖలు చేస్తే ఆ ఆట మొదలవుతుంది.