ఎవరైనా అందమైన అమ్మాయి కనపడితే ‘ఐశ్వర్య రాయ్’లా ఉందనేస్తారు. అంటే అందానికి ఐశ్వర్య రాయ్ నిర్వచనంగా మారిందన్న మాట.
కనుక ఆమె పేరు, ఫోటోలు, వీడియోలు వాడుకోవద్దంటే జనం మానేస్తారా? మానరు. అందుకే ఆమె ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఎవరూపేరు, ఫోటోలు, వీడియోలు వాడుకోకుండా నిషేధించాలని ఆమె అభ్యర్ధించారు.
ఇప్పటికే దేశంలో పలు చిన్నా పెద్ద వ్యాపార సంస్థలు తన ఫోటోలు, వీడియోలతో వ్యాపారాలు చేసుకుంటున్నాయని, ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా దురుపయోగం చేస్తున్నాయని ఆమె పిర్యాదు చేశారు. కనుక నిషేధం విధించాల్సిందిగా ఆమె ఢిల్లీ హైకోర్టుని కోరారు.
ఆమె పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాపార సంస్థలు ఆమె పేరు, ఫోటోలు, వీడియోలు వాడుకోకుండా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ 2026, జనవరి 16కి వాయిదా వేస్తూ, ఆలోగా ఆమె పిర్యాదు చేసిన సంస్థలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నది.