పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్‌ ఒక ఏడాది పూర్తి

September 07, 2025


img

మహేష్ కుమార్ గౌడ్‌ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ నేతలు ఆయనని అభినందిస్తున్నారు. 

పార్టీలో ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప మిగిలిన సీనియర్, జూనియర్ నాయకులందరూ ఆయనకు అనుకూలంగానే ఉంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరితో ఆయనకు మద్య మంచి అనుబంధమే ఉంది. వారందరూ కూడా రాజకీయంగా తమ ప్రత్యర్ధులను బాగానే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీని కట్టడి చేయడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగిస్తుండటం ఇందుకు చక్కటి ఉదాహరణ. 

కనుక మహేష్ కుమార్ గౌడ్‌కి తొలి ఏడాదిలో రాజకీయంగా పెద్ద సవాళ్ళు, సమస్యలు లేకుండానే గడిచిపోయిందని చెప్పవచ్చు. 

కానీ ఈ ఏడాదిలో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, దాని తర్వాత గ్రేటర్ ఎన్నికలు వరుసగా వస్తాయి. కనుక వీటిలో కూడా ఆయన అందరి సహాయ సహకారాలతో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోగలిగితే ఇక తిరుగు ఉండదు. 

ప్రభుత్వానికి, పార్టీకి మద్య చక్కటి బంధం, అవగాహనతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా సిఎం రేవంత్ రెడ్డికి ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చింది. ఇంత అనుకూల రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నందున పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ ఈ ఏడాదిలో ఎదురయ్యే ఈ ఎన్నికల పరీక్షలలో కూడా కాంగ్రెస్‌ పార్టీని తప్పక గెలిపించుకోగలరనే ఆశించవచ్చు. 


Related Post