ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తేజ సజ్జా సూపర్ యోధగా నటించిన ‘మిరాయ్’ రేపు శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ నడుస్తున్న రైలులో జరిగిన పోరాటాలను ఏవిదంగా చిత్రీకరించారో తెలియజేసే ఓ వీడియోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేసింది.
‘బిహైండ్ ది సీన్స్ పార్ట్:3 ట్రాక్స్ ఆఫ్ ఫ్యూరీ’ పేరుతో విడుదల చేసిన వీడియో చూస్తే మిరాయ్ సినిమా కోసం చిత్ర బృందం ముఖ్యంగా తేజా సజ్జా ఎంత కష్టపడ్డారో అర్ధమవుతుంది. కిందన పెద్ద లోయ దానిపై రైల్వే బ్రిడ్జి... ఆ బ్రిడ్జిపై సాగుతున్న రైలులో ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఈ సినిమాలో తేజా సజ్జ సూపర్ యోధగా నటించగా ప్రపంచాన్ని కబాళించాలనుకునే దుష్టశక్తిగా మంచు మనోజ్ నటించారు.
ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రీతికా నాయక్ నటించగా జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేశారు.
సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మిరాయ్ తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్‌లో నిర్మించి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయబోతున్నారు.