టీజర్‌ వచ్చేసింది... తెలుసు కదా?

September 11, 2025


img

సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా,  శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా చేసిన ‘తెలుసు కదా?’ టీజర్‌ ఈరోజు ఉదయం 11.11 గంటలకు టీజర్‌ విడుదల చేస్తామని చెప్పి గంటన్నర ఆలస్యంగా విడుదల చేశారు. ఇద్దరమ్మాయిలతో హీరో రోమాన్స్ ఈ సినిమా కధ అని టీజర్‌తో స్పష్టం చేశారు. కనుక సినిమాలో మంచి రొమాన్స్, కామెడీకి చాలా చోటు ఉంటుంది. 

ఈ సినిమాలో హర్ష చెముడు హీరో స్నేహితుడుగా నటించారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నీరజ్ కోనా;  సంగీతం: థమన్; కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవబోతోంది... తెలుసు కదా?         

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/yvg9ltBacBs?si=2291AYE4zuKGT5JL" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష