పొరుగు దేశం నేపాల్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకొనడంతో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. కానీ సైన్యం రంగప్రవేశం చేసి పరిస్థితిని చాలా త్వరగా అదుపులోకి తేగలిగింది. ఆ తర్వాత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో దేశ ప్రజలు శాంతించారు.
కనుక నేపాల్ ప్రభుత్వం మళ్ళీ మెల్లగా కుదుట పడుతోంది. తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆయనకు దేశంలో అన్ని వర్గాల నుంచి మద్దతు ఉన్నందున ఆయనకి ఈ అవకాశం దక్కనుంది. కుల్మన్ ఘీసింగ్ ఇదివరకు నేపాల్ విద్యుత్ బోర్డు ఎండీగా పనిచేశారు.
నేపాల్ చాలా చిన్న దేశమే అయినప్పటికీ తరచూ ఈవిదంగా రాజకీయ అస్తిరత ఏర్పడుతూనే ఉంది. ఆ కారణంగా ప్రధానులు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. కనుక కుల్మన్ ఘీసింగ్ ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, మళ్ళీ భవిష్యత్తులో ఇదే చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది.