వరంగల్ నగరంలో బస్సు మునిగిపోయేంత వర్షం

September 07, 2025
img

ఆదివారం వరంగల్ నగరంలో హటాత్తుగా భారీ వర్షం పడింది. ఎంత భారీగా పండిందంటే రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి వెళుతున్న రెండు ఆర్టీసీ బస్సులు ఆ వరద నీటిలో సగం వరకు మునిగిపోయాయి!

సమాచారం అందుకున్న మిల్స్ కాలనీలో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని బస్సులలో చిక్కుకున్న ప్రయాణికులను తాడు సాయంతో జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. వాటిలో ఒక బస్సు అన్నారం నుంచి రాగా మరొకటి మహబూబాబాద్ నుంచి వరంగల్ వచ్చింది. 

అవి రైల్వే అండర్ బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారి వరద నీరు ముంచెత్తడంతో డ్రైవర్లు బస్సులు ముందుకు నడపలేక నిలిపివేశారు. రెండు బస్సులలో కలిపి సుమారు 100-120 మంది వరకు ప్రయాణికులున్నారు. ప్రస్తుతం రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా నీళ్ళు నిలిచిపోవడంతో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేసే వేరే మార్గంలోకి మళ్ళిస్తున్నారు.

Related Post