మన దేశంలో ప్రధానులు రాజీనామా చేసిన సందర్భాలు చాలా అరుదు కానీ జపాన్ దేశంలో ప్రతీ నాలుగైదేళ్ళకు ప్రధానమంత్రులు రాజీనామాలు చేస్తూనే ఉంటారు.
గత ఏడాదే పుమియో కిషిద ప్రధాని పదవికి రాజీనామా చేయగా ఆయన స్థానంలో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షిగెరు ఇషిబా నేడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన షిగెరు ఇషిబా గత ఏడాది అక్టోబర్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఇంకా ఏడాది పదవీకాలం కూడా పూర్తికాలేదన్న మాట!
అయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఏడాది జూలై నెలలో మొదట పార్లమెంట్ దిగువ సభలో ఆ తర్వాత ఎగువసభలో అధికార ఎల్‌డీపీ మెజార్టీ కోల్పోయింది. కనుక మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలా వద్దా?చర్చించేందుకు ఎల్‌డీపీ రేపు (సోమవారం) సమావేశం కాబోతోంది. కనుక అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేబదులు ప్రధాని పదవికి రాజీనామా చేయడమే మంచిదనుకుని చేసేశారు. కనుక రేపటి సమావేశంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకునేందుకు ఎల్‌డీపీ సిద్దమవుతోంది.