ఈసారి బాలాపూర్ గణేశ్ లడ్డూ ఎంత పలికిందంటే...

September 06, 2025
img

హైదరాబాద్‌లో బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదం వేలంపాట స్పూర్తితో నగరంలో పలు మండపాలలో ఇప్పుడు వేలంపాట నిర్వహిస్తున్నారు. కానీ బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదం వేలంపాట ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

ఈరోజు ఉదయం 10 గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదం వేలంపాట మొదలుపెట్టగా ఈసారి 35 మంది భక్తులు పాల్గొన్నారు. వారిలో కొలను శంకర్ రెడ్డి అత్యధికంగా రూ. 30.01 లక్షలకు స్వామివారి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు.

విశేషమేమిటంటే, 1994లో తొలిసారిగా ఈ లడ్డూ ప్రసాదం వేలంపాట మొదలైనప్పుడు కొలను మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూ ప్రసాదం దక్కించుకోగా మళ్ళీ 1996లో వారి కుటుంబానికే చెందిన కొలను కృపారెడ్డి రూ.18,000లకు, 2019లో కొలను రాంరెడ్డి 17,60,000లకు, ఇప్పుడు 2025లో మళ్ళీ కొలను కుటుంబానికే చెందిన శంకర్ రెడ్డి రూ. 35,00,1000లకు స్వామివారి ప్రసాదం దక్కించుకున్నారు.

అంత డబ్బు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ అది స్వామివారి ప్రసాదం కనుక దానిని బంధుమిత్రులు, స్థానిక ప్రజలకు పంచిపెడుతుంటారు.


Related Post