రూ.8,858 కోట్ల పనులకు సోమవారం శంకుస్థాపన

September 07, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సోమవారం రూ.8,858 కోట్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేయబోతున్నారు.

హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకుగాను మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను నింపేందుకుగాను ఉద్దేశ్యించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-2,3లకి సిఎం రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటాగా రూ.7,360 కోట్లు ఖర్చు చేయబోతోంది. మిగిలిన 60 శాతం వాటా కాంట్రాక్ కంపెనీలు భరిస్తాయి. రేపు శంకుస్థాపన జరిగినప్పటి నుంచి రెండేళ్ళలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని గడువు పెట్టారు. 

ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీలకు తాగునీటి సరఫరా కొరకు రూ. 1200 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన ప్రాజెక్టును రేపు సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

నగరం చుట్టూ ఉండే 71 జలాశయాల నిర్మాణంతో పాటు కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియో పోలీస్ సెజ్‌కు తాగునీటి సరఫరా, అలాగే మురుగునీటి వ్యవస్థ నిర్మాణ పనులకు సిఎం రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు.

వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.298 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఈ పనులను కూడా రాబోయే రెండేళ్ళలో పూర్తి చేయాలని గడువు విధించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 13 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది.


Related Post