పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ భారత్‌కు కాంస్య పతకం సాధించాడు. మహిళల 50కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ భారత్‌కు స్వర్ణం సాధిస్తారనుకుంటే, ఫైనల్స్ చేరిన తర్వాత ఆమెపై అధిక బరువు ఉన్నందుకు అనర్హత వేటు వేయడంతో ఓ అద్భుతమైన అవకాశం చేజారి పోయింది.
కానీ భారత్‌కు ఉపశమనం కలిగిస్తున్నట్లు పురుషుల విభాగంలో అమన్ సెహ్రావత్ భారత్‌కు కాంస్య పతకం సాధించాడు. దీంతో రెజ్లింగ్‌లో భారత్‌కు కనీసం ఒక పతకం లభించిన్నట్లయింది.
గురువారం జరిగిన ప్రీ-క్వార్ట ర్స్‌లో ప్యూర్టోరికా రెజ్లర్ డారియన్ క్రజ్‌ని 13-5 పాయింట్స్ తేడాతో ఓడించి అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకం సాధించిన అతి తక్కువ వయసున్న (21 ఏళ్ళు) క్రీడాకారుడు అమన్ సెహ్రావత్ కావడం విశేషం. దీంతో భారత్‌కు ఒక రజతం, 5 కాంస్య పతకాలు లభించాయి. రెజ్లింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోడీ అమన్ సెహ్రావత్‌ని అభినందించారు.