జానా చెప్పిన ఆ బాహుబలి ఇతనేనా?

October 31, 2017


img

రెండు మూడు నెలల క్రితం తెలంగాణా శాసనసభాపక్ష నేత కె జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఒక బాహుబలి ఉద్భవిస్తాడు. అతనే తెరాసను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడు,” అని అన్నారు. ఆనాడు జానారెడ్డి చెప్పిన ఈ బాహుబలి డైలాగ్ పై కాంగ్రెస్, తెరాసల మద్య చాలా రోజులే వ్యంగోక్తులు సాగాయి. ఆ తరువాత ఆ విషయం అందరూ మరిచిపోయారు. ఇప్పుడు హటాత్తుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాలలో చాలా సంచలనం సృష్టిస్తోంది. కనుక జానారెడ్డి చెప్పిన ఆ బాహుబలి రేవంత్ రెడ్డేనని భావించవలసివస్తోంది.ఒకవేళ బాహుబలి ఇంకా రాలేదని జానారెడ్డి చెప్పినట్లయితే, అప్పుడు తెరాసలో అగ్రనేతలవైపు చూడవలసి వస్తుంది.

వివాదాల రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందిస్తూ “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి. బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు,” అని అన్నారు. 

కనుక జానారెడ్డి చెప్పిన ఆ బాహుబలి రేవంత్ రెడ్డేనని భావించవచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ, వృద్ధ బాహుబలులు అతనికి ఏమేరకు సహకరిస్తారో చూడాలి.


Related Post