ఎన్డీఏ, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్ధులను ప్రకటించడంతో మళ్ళీ రాజకీయాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల మద్య తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగుతాయి.
తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఆరాటపడుతోంది. కానీ దానికి ‘హిందీ’తోనే బ్రేకులు వేస్తోంది అధికార డీఎంకే పార్టీ.
కనుక తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు పీసీ రాధాకృష్ణన్‌ని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ఎంపిక చేసింది. తద్వారా తమిళనాడు ప్రజలను ప్రసన్నం చేసుకోవచ్చని బీజేపీ పెద్దలు భావించి ఉండొచ్చు.
ఆయన తమిళనాడుకి చెందినవారు కనుక డీఎంకే వ్యతిరేకించలేని పరిస్థితి కల్పించింది. కానీ డీఎంకే అంతా సులువుగా బీజేపీ ఉచ్చుకు చిక్కుకునే పార్టీ కాదు. దానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంది కనుక ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ఖాయమే అని భావించవచ్చు.
జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లకు చేసిన అభ్యర్ధన కూడా ఇదే విధంగా ఉంది. కృష్ణా, గోదావరి నీళ్ళ పంపకాలకు, బనకచర్ల ప్రాజెక్టుకి వర్తించని ఈ ‘తెలుగు సెంటిమెంట్’ ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి మాత్రం దేనికి?అని టీడీపీ ప్రశ్నించక మానదు.