ప్రొఫెసర్ కోదండరామ్‌కు సుప్రీంకోర్టు షాక్

August 13, 2025


img

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఎంపికైన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, అమీర్ అలీఖాన్‌లకు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. వారిద్దరి నియామకాలపై స్టే విధించింది. తక్షణం ఈ స్టే అమలులోకి వస్తుందని, తదుపరి తీర్పు వరకు ఇది అమలులో ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 

బీఆర్ఎస్‌ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ వారిద్దరి నియామకాలని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు వారి నియామకాలపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వారిరువురూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారాలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 

ఇది వారిద్దరికీ పెద్ద షాక్ అనే భావించవచ్చు. ఇటీవలే సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధించి మరో షాక్ ఇచ్చింది. 


Related Post