ఎన్నికల సంఘమే అక్రమాలకు పాల్పడుతుంటే....

August 07, 2025

img

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలో ఇందిరా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు బీజేపికి లబ్ది కలిగించేందుకు ఏవిదంగా అక్రమాలకు పాల్పడుతున్నాయో వివరించారు.

ఈసీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళకు తలొగ్గి వివిధ రాష్ట్రాలలో ఓ పక్క దొంగ ఓట్లు వేసేందుకు బీజేపికి తోడ్పడుతూ, మరోపక్క కాంగ్రెస్‌ మిత్ర పక్షాలకు అనుకూలంగా ఉండేవారి ఓట్లు లక్షల సంఖ్యలో తొలగిస్తోందని ఆరోపించారు.

ఇందుకు సాక్ష్యంగా అయన ఓటర్‌ కార్డుల జాబితాలను ప్రదర్శించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు బెంగళూరులో ఒకే ఇంట్లో 80 ఓటర్లు, మహాదేవ్‌పూర్‌లో ఒకే చిరునామాతో ఏకంగా 10,000 ఓట్లు పోల్ అయ్యాయని ఆరోపించారు.

ఒక రాష్ట్రంలో నివసిస్తూ ఓటు హక్కు కలిగినవారు వేర్వేరు రాష్ట్రాలలో అదే పేరు చిరునామాతో ఓట్లు ఎలా వేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కనీసం ఫోటోలు, అడ్రస్ లేని ఓటర్ జాబితాలను రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మీడియా ప్రతినిధులకు చూపారు.

మహారాష్ట్ర , కర్ణాటక ఎన్నికలలో జరిగిన ఈ మోసాలను ఇప్పుడు బిహార్‌లో కేంద్ర, రాష్ట్ర  ఎన్నికల సంఘాలు కూడా అమలుచేయబోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తారుమారు చేస్తున్నండునే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై మరి కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుందో?

LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi | #VoteChori | AICC HQ, New Delhi. https://t.co/3WzBejfgrw
— Congress (@INCIndia) August 7, 2025

Related Post