ప్రధాని మోడీ పాక్‌కు హెచ్చరిక.. దేనికి సంకేతం

May 30, 2025


img

ప్రధాని మోడీ ప్రస్తుతం బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు కర్‌కట్ వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ, “పహల్గాం దాడి జరిగిన మర్నాడు నేను ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మన మహిళల నుసుట కుంకుమ బొట్టు చెరిపేసిన ఉగ్రవాదులను మట్టు బెడతానని మాటిచ్చాను.

ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులను, వారి శిబిరాలను మట్టు బెట్టాము. ఆపరేషన్ సింధూర్‌ కేవలం శాంపిల్ మాత్రమే. అది మన అమ్ముల పొదిలో ఓ అస్త్రం మాత్రమే. ఒకవేళ పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు మళ్ళీ అటువంటి దుశ్చర్యకు ప్రయత్నిస్తే ఈసారి పాము తల నరికేస్తాము. కనుక పాక్‌ మళ్ళీ అటువంటి దుసాహసం చేయదనే భావిస్తున్నాను,” అని అన్నారు. 

ఈ ఏడాది బిహార్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక ప్రధాని మోడీ ఈ పేరుతో అక్కడి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే, అది పాకిస్థాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. భారత్‌లో ఎన్నికలొస్తే పాక్‌ మీద దాడులు చేయడం పరిపాటిగా మారిపోయిందని ఇప్పటికే పాక్‌ పాలకులు, మీడియా ఆరోపిస్తోంది. 

కానీ ప్రధాని మోడీ హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉగ్రదాడులు చేస్తే ఏమవుతుందో పాకిస్థాన్‌ పాలకులు, ఆర్మీ అధికారులకి బాగా అరదమైంది కనుక ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేల చేస్తాయి కూడా. 


Related Post