ఇక టర్కీ యాపిల్స్ అమ్మబోము.. అంతే!

May 13, 2025


img

పూణేలో పళ్ళ వ్యాపారులకు ఉన్నపాటి దేశభక్తి దేశ ప్రజలందరికీ ఉండి ఉంటే చైనా, పాకిస్థాన్‌ వంటి దేశాలు భారత్‌ వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించేవి కావు. భారత్‌-పాక్‌ యుద్ధంలో టర్కీ తయారు చేసి ఇచ్చిన డ్రోన్లను భారత్‌పై దాడులకు పాక్‌ ఉపయోగించిన సంగతి తెలిసిందే.

ఇందుకు నిరసనగా పూణేలో పళ్ళ వ్యాపారులు ఇక నుంచి టర్కీ యాపిల్స్ అమ్మకూడదని నిర్ణయించారు. పూణేలో మాత్రమే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న వ్యాపారులు కూడా టర్కీ యాపిల్స్ అమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

పూణేలో ఓ పళ్ళ వ్యాపారి మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌-పాక్‌ మద్య గొడవలతో టర్కీకి ఎటువంటి సంబంధమూ లేదు. కానీ అది పాక్‌కు డ్రోన్లు సరఫరా చేసి భారత్‌పై దాడికి తోడ్పడింది. టర్కీలో భూకంపం వస్తే మొట్ట మొదట భారత్‌ నుంచే విమానంలో మందులు, ఆహార పదార్ధాలు, ఇతర సహాయ సామగ్రి పంపాము. కానీ అందుకు ఏమాత్రం కృతజ్ఞత చూపకపోగా భారత్‌పై దాడులకు పాక్‌కు సహకరించింది. 

అటువంటి ధూర్త దేశం నుంచి యాపిల్ పళ్ళు దిగుమతి చేసుకొని అమ్మాల్సిన అవసరం ఏమిటి?ఒక్క పూణే నగరంలోనే ఏడాదిలో మూడు నెలల్లోనే సుమారు రూ.1200-1500 కోట్లు విలువ చేసే టర్కీ యాపిల్స్ అమ్ముతుంటాము. ఇక నుంచి ఆ అమ్మకాలు బంద్ చేస్తున్నాము. 

ఒక్క టర్కీ మాత్రమే కాదు చైనా కూడా పాక్‌కు ఆయుధాలు సరఫరా చేసింది. ఆ ఆయుధాలనే భారత్‌పై పాక్‌ ప్రయోగించింది. కనుక చైనా మాల్‌ అమ్మకాలు, కొనుగోలు మానుకోవాలని వ్యాపారులకు, దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. నిజమే కదా?             


Related Post