భారత్‌ సంచలన నిర్ణయం!

May 10, 2025


img

ఈరోజు ప్రధాని మోడీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌, హోమ్ మంత్రి అమిత్ అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, త్రివిధ దళాధిపతులు అత్యున్నత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానిని ‘యుద్ధ చర్య’గానే పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని రక్షణ శాఖ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. 

పహల్గాం దాడితో భారత్‌-పాక్‌ మద్య యుద్ధం మొదలైంది. కేవలం మూడు రోజులలోనే పరస్పరం క్షిపణులు ప్రయోగించుకునే తీవ్ర దశకు చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు హెచ్చరిక వంటిదే అని భావించవచ్చు. 

కానీ యుద్ధం మొదలైన తర్వాత పాక్‌ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌ పాలకులు, సైన్యాధికారులకు భారత్‌ చేస్తున్న ఈ హెచ్చరిక చెవికి ఎక్కుతుందని అనుకోలేము. ఎలాగూ ప్రస్తుతం యుద్ధం జరుగుతూనే ఉంది కనుక కొత్తగా వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని మరింత రెచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. 


Related Post