పాక్‌ ప్రజలు పారిపోతుంటే... భారత్‌ ప్రజలు.

May 10, 2025


img

భారత్‌ దాడులకు భయపడి పాకిస్థాన్‌లో పలు నగరాలు, పట్టణాలలో ప్రజలు మూటాముల్లె సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుంటే, భారత్‌లో దాడులకు గురవుతున్న పట్టణాలు, గ్రామాలలో ప్రజలు, ముఖ్యంగా యువత కూలిన పాక్‌ డ్రోన్ శకలాలను ఏరేందుకు పరుగులు తీస్తున్నారు.

ఆకాశంలో పాక్‌ డ్రోన్లను, క్షిపణులను, యుద్ధ విమానాలను భారత్‌ కూల్చివేస్తుంటే, దీపావళి పండుగని ఎంజాయ్ చేస్తున్నట్లు వాటిని చూస్తూ కేరింతలు కొడుతూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. 

మాజీ సైనికులు, ఆర్మీ, నేవీ, వాయుసేనలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు అవసరమైతే మళ్ళీ యూనిఫారం ధరించి తుపాకులు పట్టుకొని పాక్‌తో యుద్ధం చేసేందుకు సిద్దమని చెపుతున్నారు.

తాజాగా పాక్ దాడికి గురవుతున్న పంజాబ్‌లో ఆర్మీకి అవసరమైన సేవలు అందించేందుకు వాలంటీర్లు కావాలని ప్రకటించగా వందలాది మంది యువతీ యువకులు, మద్యవయసువారు, మహిళలు కూడా ఆర్మీ క్యాంప్ వద్ద క్యూకట్టారు.

తమకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదని దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న మన సైనికులకు సేవ చేస్తే, తాము కూడా దేశసేవలో భాగస్వాములమైనట్లు భావిస్తామని వారు చెపుతున్నారు. 

భారత్‌, పాక్‌ పాలకుల, ఇరు దేశాల సైన్యాల సామర్ధ్యాలలోనే కాదు.. ఇరు దేశాల ప్రజలలో కూడా ఇంత వ్యత్యాసం కనిపిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.       


Related Post