పనిచేసే ప్రభుత్వం అంటే ఇదే కదా!

March 22, 2021


img

నేటికీ ప్రభుత్వాలంటే ప్రజల దృష్టిలో అదో అంతుపట్టని బ్రహ్మపదార్ధం... లేదా సమస్యలపై స్పందించని జడ పదార్ధం. ఇక మంత్రులు...ఎమ్మెల్యేలంటే ఆడంబరాలు, అహంభావానికి ప్రతీకలు...అని భావిస్తుంటారు. కానీ పనిచేసే ప్రభుత్వం... స్పందించే మంత్రులు...ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందుకు తాజా నిదర్శనం ఇదే... 

రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావు ఆదివారం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్‌లోని వ్యయసాయ మార్కెట్‌లో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న కూడవెళ్ళి గ్రామానికి చెందిన రైతులు అక్కడకు చేరుకొని తమ ప్రాంతంలో కాలువ లేకపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయని, పొలాలకు నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్నాయని కనుక కాలువ తవ్వించి పంటలకు నీళ్ళు అందించాలని విజ్ఞప్తి చేశారు. 

మంత్రి హరీష్‌రావు వెంటనే వారితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన తరువాత వారి సమక్షంలోనే సాగునీటి శాఖ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ తరువాత అక్కడి నుంచే సిఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి కూడవెళ్ళి రైతుల సమస్యను వివరించారు. 

సిఎం కేసీఆర్‌ కూడా వెంటనే స్పందిస్తూ, గజ్వేల్ కాలువ నుంచి జగదేవపూర్ కాలువకు, దాని నుంచి చేబర్తి చెరువులోకి గోదావరి జలాలను విడుదల చేయాలని, అందుకోసం తక్షణమే అత్యవసరంగా కాలువ తవ్వించాలని మంత్రి హరీష్‌రావుకు సూచించారు. 

మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు ఈరోజు సాయంత్రంలోగా కాలువ తవ్వకం పనులు పూర్తి చేసి రేపు (మంగళవారం) ఉదయానికల్లా కూడవెళ్ళి గ్రామంలో పంటలకు నీళ్ళు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పనిచేసే ప్రభుత్వం అంటే ఇదే కదా?ప్రజా సమస్యలపై స్పందించే మంత్రి హరీష్‌రావు, సిఎం కేసీఆర్‌ వంటి కలిగి ఉండటం ప్రజల అదృష్టమే కదా? 


Related Post