ఆర్టీసీ జీతాలకు డబ్బులేవు: తెరాస సర్కార్‌

October 21, 2019


img

ఆర్టీసీ సమ్మె 17వ రోజుకు చేరినపటికీ దానిపై తెరాస సర్కార్‌ వైఖరిలో ఎటువంటి మార్పులేదని నేడు మరోమారు స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లింపుపై నేడు మళ్ళీ హైకోర్టులో విచారణ మొదలైనప్పుడు ప్రభుత్వం తరపున పాల్గొన్న అడ్వకేట్ జనరల్, యధాప్రకారం ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని వాదన మొదలుపెట్టారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం వద్ద తగినంత సొమ్ము లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపులకు రూ.224 కోట్లు అవసరం కాగా ఆర్టీసీ యాజమాన్యం వద్ద 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని కనుక ప్రస్తుత పరిస్థితులలో జీతాలు చెల్లించడం కష్టమని అన్నారు. 

ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున వాదిస్తున్న న్యాయవాది, ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుకు...సమ్మె చట్టబద్దమా...కాదా అనే దానికి ఎటువంటి సంబందమూ లేదని, గత నెలలో కార్మికులు పనిచేసిన రోజులకు ఆర్టీసీ యాజమాన్యం తప్పనిసరిగా జీతాలు చెల్లించాల్సిందేనని వాదించారు. ఈ కేసుపై విచారణను మధ్యాహ్నం భోజన విరామం తరువాత 2.15 గంటలకు మళ్ళీ మొదలవుతుంది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించకూడదనే వైఖరికి గట్టిగా కట్టుబడి ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కనుక హైకోర్టు ప్రభుత్వం చేత ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లింపచేయగలదా లేదో చూడాలి.


Related Post