రోషన్ హీరోగా ‘ఛాంపియన్’ సినిమా రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. కనుక నేడు ఛాంపియన్ సెలబ్రేషన్స్ అంటూ ఓ రిలీజ్ ట్రైలర్ విడుదలచేశారు.
ఇదివరకు విడుదల చేసిన ట్రైలర్‌లో భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం నవాబు సేనల ఆగడాలు, తెలంగాణలో బైరాన్‌పల్లిలో జరిగిన దమనఖాండ చూపారు. నేడు విడుదల చేసిన ట్రైలర్ అందుకు పూర్తి భిన్నంగా మంచి మ్యూజిక్, డాన్స్, కామెడీతో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరో లండన్‌లో విలాసవంతమైన జీవితం, ఫుట్‌బాల్ చాంపియన్, ఓ చక్కటి గ్రామీణ ప్రేమకధ, హీరో పోరాటాలను కూడా కలిపారు. కనుక మామూలు ఛాంపియన్ కాదు. అంతకు మించే అనుకోవచ్చు.
ఈ సినిమాలో రోషన్, అనస్వర రాజన్ జంటగా చేశారు. స్వాతంత్ర్య పోరాటాలు సాగుతున్న సమయంలో ఫుట్ బాల్ ఆట నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రదీప్ అద్వైతం, సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: మాదే ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, స్టంట్స్: పీటర్ హెయిన్ చేశారు.
స్వప్న సినిమా, ఆనందీ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రియాంకా దత్, జీకె మోహన్, జెమిని కిరణ్ కలిసి ఈ సినిమా నిర్మించారు.