రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లిమ్స్ విడుదలైంది. బాల్యం నుంచి దౌర్జన్యాలు, అణచివేతకు గురైన ఓ పిల్లాడు ఎదురుతిరిగి రౌడీ జనార్ధనగా మారినట్లు టైటిల్ గ్లిమ్స్ చెప్పేశారు.
కళింగపట్నంలో ఇంటికో రౌడీనని చెప్పుకొని తిరుగుతుంటారు కానీ ఇంటి పేరునే రౌడీగ అమార్చుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు... జనార్ధన... రౌడీ జనార్ధన..” డైలాగ్ ఆకట్టుకుటుంది. కానీ టైటిల్ గ్లిమ్స్ ప్రకారమే సినిమా తెరకెక్కించి ఉంటే సినిమా అంతటా రక్తపాతం తప్పదనిపిస్తుంది. ఒకవేళ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని వదిలేసుకున్నట్లే అవుతుంది. రౌడీ జనార్ధనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవికిరణ్ కోలా, అడిషనల్ స్క్రీన్ ప్లే: జనార్ధన పసుమర్తి, సంగీతం: క్రిస్టో జేవియర్, కెమెరా: ఆనెంద్ సి చంద్రన్, స్టంట్స్:సుప్రీం సుండ, ఆర్ట్: సత్యనారాయణ డివై చేశారు.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు టైటిల్ గ్లిమ్స్‌లో చూపారు.