క్రిస్మస్ రోజున నెట్‌ఫ్లిక్స్‌లో రివాల్వర్ రీటా...

December 21, 2025


img

జెకె చంద్రు దర్శకత్వంలో కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర చేసిన ‘రివాల్వర్ రీటా’ నవంబర్‌ 28న థియేటర్లలో విడుదలైంది, మిశ్రమ స్పందనతో గట్టెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. ఈ నెల 25న క్రిస్మస్ పండగ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. 

రెండు మాఫియా గ్యాంగ్‌ల మద్య జరిగే గొడవల్లో హీరోయిన్‌ రీటా (కీర్తి సురేష్‌), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్‌) అనూహ్యంగా చిక్కుకుంటారు. వాటిని వారు ఏవిధంగా ఎదుర్కొన్నారు? ఏవిధంగా బయటపడ్డారనేదే ఈ సినిమా కధ. 

ఈ సినిమాలో మాఫియా లీడర్లుగా సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్ నటించారు.  రెడిన్ కింగ్‌స్లీ, సురేష్ చక్రవర్తి, కళ్యాణ్ మాస్టర్, సేంద్రయన్, ఆగస్టిన్, రామచంద్రన్, గాయత్రి షాన్, కుహసిని ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జెకె చంద్రు, సంగీతం: సియాన్ రోల్డన్, కెమెరా: దినేష్ కృష్ణన్, ఎడిటింగ్:ప్రవీణ్ కేఎల్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: ఎంకేటి చేశారు. 

పాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై సుధన్ సుందరం, జగదేశ్ పళనిస్వామి కలిసి ఈ సినిమా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష