పెద్ద సినిమాల నడుమ వస్తున్న చిన్న సినిమాలు, తమిళ డబ్బింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొక్కొరోకో కూడా ఒకటి. శ్రీనివాస్ వసంతాల దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్, పూజా హెగ్డే, నోరా ఫతే, మీరాజ్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందంటూ ఓ పోస్టర్ వేశారు.
ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే: రమేష్ వర్మ, డైలాగ్స్: జీవీ సాగర్, సంగీతం: కృష్ణ ప్రసాద్, కెమెరా: ఆకాష్ ఆర్ జోషి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, స్టంట్స్: వెంకట్ నేడూరి చేశారు.
ఆర్‌వి స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రేఖ వర్మ, కూరపాటి శిరీష కలిసి ఈ సినిమా నిర్మించారు. షూటింగ్ పూర్తయింది కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చినెలల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.