రవితేజ పారితోషికం తీసుకోలేదు కానీ...

December 21, 2025


img

ప్రశాంత్ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని మొన్న విడుదలైన టీజర్‌తోనే చెప్పేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించారు. దానిలో విలేఖరి అడిగిన ప్రశ్నకు నిర్మాత సుధాకర్ చెరుకూరి సమాధానం చెపుతూ, “ఈ సినిమాలో నటించేందుకు రవితేజ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. కానీ సినిమా ఒప్పుకునేటప్పుడే తప్పనిసరిగా సంక్రాంతి పండగకు ముందు విడుదల చేయాలని షరతు పెట్టారు. ఆ ప్రకారమే సినిమా పూర్తి చేసి జనవరి 13న విడుదల చేస్తున్నాము,” అని చెప్పారు.        

ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్‌, సునీల్, సత్య, శుభలేక సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు. 

ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి పండగకు భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసేందుకు వస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష