కామ్రేడ్ కళ్యాణ్‌కి జోడీగా మహిమా నంబియార్

December 21, 2025


img

జానకీ రామ్‌ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మహిమా నంబియార్ శ్రీవిష్ణుకి జోడీగా నటిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా కామ్రేడ్ కళ్యాణ్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.   

ఈ సినిమాలో శ్రీవిష్ణు మోస్ట్ వాంటడ్‌ మావోయిస్టుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్‌ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.            

స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో కామ్రేడ్ కళ్యాణ్ విడుదలయ్యే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష