ఎస్‌వీసీ 59 టైటిల్‌ గ్లిమ్స్‌ రేపు విడుదల

December 21, 2025


img

రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఎస్‌వీసీ 59 వర్కింగ్ టైటిల్‌తో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌  సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ మరియు ఏలూరులో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీ ప్లెక్స్, ఏలూరులో ఎస్‌వీసీ సినిమాస్‌లో ఒకేసారి విడుదల కాబోతోంది. సాయంత్రం 4 గంటల నుంచి టైటిల్‌ గ్లిమ్స్‌ రిలీజ్ ఈవెంట్‌ మొదలవుతుంది.     

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష