తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం జరుగుతోంది. మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ సమావేశం దేని గురింఛనేది అధికారికంగా తెలియజేసింది.
“పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి జల వాటాలపై గురుశిష్యులు, బడేభాయ్, చోటేభాయ్ రూపంలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. మన తెలంగాణ నీళ్ళను తరలించుకుపోవడానికి దొంగలంతా ఒక్కటయ్యారు.
నాడు అరవై ఏండ్ల ఉమ్మడి పాలకుల కుట్రలకు బలైన అన్నదాతల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్.. రైతుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం నేడు మళ్ళీ మరో జలపోరాటానికి సిద్ధం అయ్యాడు. కేంద్రంలోని బీజేపీ, ఆ కూటమి చేసే కనుసైగలకు జీ.. హుజూర్ అంటూ తలొగ్గిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరో జలసాధన ఉద్యమం తథ్యం,” అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.
పంచాయితీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించడంతో ఆ ఉత్సాహం, సంతోషం కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపై ఆయన రంగంలో దిగబోతున్నానని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసినట్లే భావించవచ్చు. కనుక ఇకపై కేసీఆర్ ప్రతీరోజూ లేదా తరచూ పార్టీ కార్యాలయానికి వచ్చి మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉందనే భావించవచ్చు.