ఇవిగో మేడారం మహాజాతర పోస్టర్స్!

December 21, 2025
img

రెండేళ్ళ కోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి 31వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి మేడారం మహాజాతర-2026 పోస్టర్స్ విడుదల చేశారు. 

మేడారం మహా జాతరకు హైదరాబాద్‌తో సహా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా తెలంగాణ, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో మారుమూల అడవులు, గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులు, ఆదివాసీలు మేడారం జాతరకు తరలివచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. 

కనుక జిల్లా రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్‌, మున్సిపల్ తదితర విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే మేడారంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

మహా జాతర సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇప్పటి నుంచే భక్తులు తరలివచ్చి మేడారంలోగద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కనుక అప్పుడే మేడారంకు పండగ కళ, సందడి వచ్చేసింది.

Related Post