నటుడు శివాజీ సోమవారం ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల డ్రెస్ సెన్స్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సినీ పరిశ్రమలో అనసూయతో సహా పలువురు శివాజీ వ్యాఖ్యలను తప్పు పట్టారు, నటుడు మంచు మంచు మనోజ్ అయన తరపున మహిళలకు క్షమాపణ చెప్పారు.
ఈ వివాదస్పద వ్యాఖ్యలపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కనుక శివాజీ స్పందిస్తూ సోషల్ మీడియాలో మహిళలకు క్షమాపణలు చెపుతూ ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు. తాను స్త్రీలను చాలా గౌరవిస్తానని, కనుక అందరూ మహిళలను గౌరవభావంతో చూడాలనే సదుద్దేశ్యంతో ఓ సలహా ఇవ్వాలనుకున్నాను తప్ప ఎటువంటి దురుదేశ్యం లేదని శివాజీ అన్నారు.
కానీ తన మాటలలో రెండు అనుచిత పదాలు దొర్లాయని ఒప్పుకున్నారు. మహిళల నుద్దేశ్యించి అటువంటి పదాలు వాడటం తప్పేనని శివాజీ ఒప్పుకున్నారు. వాటితో మహిళలు బాధపడతారు కనుక బేషరతుగా క్షమాపణలు చేపుతున్నాను,” అని శివాజీ ఆ వీడియో సందేశంలో చెప్పారు.
ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...