బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ టీమ్ షూటింగ్ కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ స్థానిక మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలు షూటింగ్ చేశారు.
తాజాగా ఏపీ భవన్ క్యాంటీన్లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నేడో రేపో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చేస్తారు. సుమారు 20 రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. ముందుగా ఐటెం సాంగ్ పూర్తి చేసి తర్వాత టాకీ పార్ట్ పూర్తి చేస్తారు. జనవరి నెలాఖరులోగా పెద్ది షూటింగ్ పూర్తిచేయాలని బుచ్చిబాబు పక్కా ప్లాన్ చేసుకున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.