ఆడవాళ్ళు... సామాను: శివాజీ వివాదస్పద వ్యాఖ్యలు

December 23, 2025


img

సినీ పరిశ్రమలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ చాలా కాలంగా సరైన సినిమా, పాత్ర లేక వెనకబడిపోయారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో మళ్ళీ పుంజుకున్నారు. 

తాజాగా ‘దండోరా’ సినిమాతో ఈ నెల 25న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కార్యక్రమం జరిగింది. దీనిలో శివాజీ సినిమాలలో మహిళల వేషధారణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

“మహిళలు ఒంటి నిండా చీర కట్టుకుంటే ఆ అందమే వేరు. కానీ సామాను అంతా కనిపించేలా బట్టలు ధరిస్తేనే అందంగా కనిపిస్తామనుకుంటారు. అది కేవలం వారి భ్రమ. ఆ బట్టలలో వారిని చూసినవారు ఆహా ఓహో అని మెచ్చుకోవచ్చు. కానీ లోలోన వారి ఆలోచన వేరేలా ఉంటుంది. 

స్త్రీ అంటే ప్రకృతి. ఈ ప్రక్రుతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. అలనాటి సావిత్రమ్మ, సౌందర్య, ఇప్పటివారిలో రష్మిక వంటివారున్నారు. మన మనసులలో వారి పట్ల గౌరవం ఏర్పడటానికి కారణం వారు నిండుగా చీర కట్టుకోవడం వల్లనే. 

చీర కట్టుకున్నవారే ప్రపంచ సుందరి అయ్యారు కదా? నేనిలా మాట్లాడితే నాపై మహిళా స్వేచ్చ, స్వాతంత్ర్యం అంటూ చాలా మంది విరుచుకుపడతారు. కానీ స్వేచ్చకీ ఓ హద్దు ఉంటుందని గ్రహిస్తే మంచిది,” అని శివాజీ అన్నారు.

ఆయనేమన్నారో ఆయన మాటలల్లోనే....          


Related Post

సినిమా స‌మీక్ష