మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి నేడు ‘రాజుగారి పెళ్ళిరో’ పాట ప్రమో విడుదలైంది. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ కలిసి పాడారు. అయితే ప్రమోలో పాట మ్యూజిక్ మాత్రమే వినిపించారు. శుక్రవారం పూర్తిపాట విడుదలైనప్పుడు లిరిక్స్ వినిపిస్తారన్న మాట!
ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన అనగనగా ఒక రాజు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.