రవాణాశాఖలో అవినీతి తిమింగలం.. విలువ 12.72 కోట్లు!

December 24, 2025
img

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రవాణాశాఖలో ఓ భారీ అవినీతి తిమింగలాన్ని వల వేసి పట్టుకున్నారు.

మహబూబ్ నగర్‌లో రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్‌గా చేస్తున్న మూడ్ కిషన్‌ ఇంటితో సహా అయన బంధువుల ఇళ్ళు, కొందరు అత్యంత సన్నిహితుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు మంగళవారం ఒకేసారి సోదాలు నిర్వహించారు.

సికింద్రాబాద్‌ ఓల్డ్ బోయినపల్లి రాజరాజేశ్వరి నగర్‌లో అయన ఉంటున్నారు. ఆ ఇంటితో సహా రాష్ట్రంలో హైదరాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్ నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి మొత్తం రూ.12.72 కోట్లు విలువైన స్థిర, చిరాస్తులు గుర్తించారు.

స్థిరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు వంద కోట్లు వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. రవాణాశాఖలో ఓ అధికారి వంద కోట్లు విలువైన ఆస్తులు పోగేసుకోగలిగారంటే ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో ఊహించడం కూడా చాలా కష్టం. 

Related Post