మేడారం గద్దెలపై వనదేవతల ప్రతిష్టాపన

December 24, 2025
img

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగాణాన్ని పాలరాయి స్థంభాలతో పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నేడు వాటిలో గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవింద రాజులను తీసుకువచ్చి ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్, మేడారం మహాజాతర కార్యనిర్వాహక అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. 

ఆలయ పూజరులు ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ముందుగా గోవిందరాజును, తర్వాత 9.45 గంటలకు పగిడిద్దరాజును గద్దెలపై ప్రతిష్టించారు. ఇంకా కొన్ని పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నందున భక్తులను దర్శనాల కోసం అనుమతించలేదు. త్వరలో కొత్తగా నిర్మించిన గద్దెలపై వనదేవతల దర్శనాలకు అనుమతిస్తారు.         


Related Post