నాని హీరోగా చేస్తున్న ప్యారడైజ్, విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న రౌడీ జనార్ధన పోస్టర్లు, ఫస్ట్ గ్లిమ్స్‌లో రక్తం ఏరులైపారింది. ఇప్పుడు అందాల భామ రష్మిక మందన కూడా రక్తం ఏరులై పారిస్తోంది.
ఆమె ప్రధాన పాత్ర తెరకెక్కుతున్న ‘మైసా’ ఫస్ట్ గ్లిమ్స్ నేడు విడుదలైంది. దాని నిండా రక్తపాతమే. సినిమాల ఫస్ట్ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్‌లలోనే ఇంత రక్తం పారిస్తున్నప్పుడు, ఇక సినిమాలలో ఎంత రక్తం పారుతుందో అనిపించక మానదు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో లేదా దసరా, దీపావళికి మైసా విడుదలయ్యే అవకాశం ఉంది.