సిఎం రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లా కోస్గీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని వారి అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి చాలా పెద్ద శపధమే చేశారు. ఏమన్నారంటే, వచ్చే ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. అదీ 100కి కనీసం 75-80 సీట్లు గెలుచుకుంటాము. కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కావాలంటే ఇప్పుడే రాసిపెట్టుకోండి.
మీరు ఎన్ని రాజకీయాలైన చేసుకోండి నేను రాజకీయాలలో ఉన్నంత కాలం తెలంగాణలో ఎన్నటికీ ఈ కల్వకుంట్లని, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వను. ఇదే నా శపథం,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేమే గెలుస్తామని చెప్పుకోవడం సర్వసాధారణం. కనుక సిఎం రేవంత్ రెడ్డి కూడా అలాగే చెప్పారనుకున్నా, మెజార్టీ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తామని చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చూడవచ్చు.
2023 ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని గెలవనీయనని పదేపదే చెప్పారు. అలాగే రాకుండా అడ్డుకున్నారు. పదేళ్ళ పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ కేసీఆర్‌ని ఓడించలేకపోయారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఓడించారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా?
కనుక తాను రాజకీయాలలో ఉన్నంత కాలం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వననే సిఎం రేవంత్ రెడ్డి శపధాన్ని తేలికగా కొట్టిపడేయలేము. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట వంటి జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికకు ఆయన ఎవరూ ఊహించలేని వ్యూహం రచించి పార్టీని గెలిపించుకున్నారు కదా?
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి ఇప్పటికే అయన మనసులో ఏదో పెద్ద వ్యూహం సిద్ధంగానే ఉందనిపిస్తుంది ఈ శపథం విన్నప్పుడు.
కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
2029 ఎన్నికల్లో 2/3 సీట్లతో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
చేతనేతే కాసుకో బిడ్డా
నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను
కొడంగల్ బిడ్డగా ఇదే నా శపథం
- సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/1fZcKPPTeC