అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ‘ఫంకీ’ నుంచి దీరే దీరే అంటూ సాగే మధురమైన డ్యూయెట్ లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. దర్శకుడు అనుదీప్ స్వయంగా ఈ పాట వ్రాశారు. ఈ పాటని భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి సంగీతం అందించగా సంజిత్ హెగ్డే, రోహిత్ సొర్రత్ అద్భుతంగా పాడారు. ఓ చక్కటి పాట విన్నామనే సంతోషం కలుగుతుంది.
ఇటీవల విడుదలైన ఫంకీ టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది, ఇప్పుడీ పాట సినిమాపై అంచనాలు పెంచాయనే చెప్పవచ్చు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ సినీ దర్శకుడుగా నటించగా, హీరోయిన్ కాయడు లోహర్ ఆ సినీ నిర్మాతగా నటించింది. నిర్మాత, దర్శకుడు ప్రేమలో పడితే కామెడీకి, రోమాన్స్ కి కొరతే ఉండదని టీజర్‌లో చూపించేశారు.
ఈ సినిమాలో నరేష్, విటివి గణేశ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.