నిజామాబాద్‌లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

September 21, 2019


img

నిజామాబాద్‌లో ఒక యువతిపై స్థానిక ఆటో డ్రైవర్ సురేశ్ అత్యాచారం చేశాడు. ఆ తరువాత తన ఆరుగురు స్నేహితులను కూడా అక్కడకు పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెపై తన స్నేహితులు అత్యాచారం చేస్తుండగా ఆ దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, నిజామాబాద్‌లో ఒక కర్మాగారంలో పనిచేయడానికి ఆమె రోజూ ఆటోలో వెళుతుండేది. స్థానిక ఆటో డ్రైవర్ సురేశ్ ఆమె పరిస్థితి గమనించి ఆమెతో ప్రేమ నటించాడు. అప్పటికే అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆవిషయం దాచిపెట్టి మాయమాటలతో నమ్మించాడు. అతనితో ప్రేమలో పడిన ఆ యువతిని శుక్రవారం మధ్యాహ్నం సారంగపూర్ హనుమాన్ ఆలయానికి వెళదామని చెప్పి ఆటోలో సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఓ జైలు గోడ వెనుక ఆమెపై అత్యాచారం చేసిన తరువాత సురేశ్ తన స్నేహితులకు ఫోన్లు చేసి పిలిచాడు. వారు కూడా వచ్చి ఆమెపై వరుసగా అత్యాచారం చేశారు. అతికష్టం మీద ఆమె ఇంటికి చేరుకొంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిలో కొందరిని అదుపులో తీసుకున్నారు. 

అత్యాచారాలకు కటినమైన శిక్షలు విధిస్తున్నారని తెలిసి ఉన్నా ఇంకా సురేశ్ వంటి చాలా మంది ధైర్యంగా సామూహిక అత్యాచారాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఏదో విందుభోజనానికి పిలిచినట్లు స్నేహితులను కూడా ఆహ్వానించి అత్యాచారానికి పాల్పడుతుండటం చూస్తే వారి దృష్టిలో మహిళలు సాటి మనుషులుగా కాక అనుభవించతగ్గ వస్తువులు లేదా ఆహార పదార్ధాలు అన్నట్లుంది. ఇది ఇంకా దారుణమైన విషయం. కనుక చిన్నప్పటి నుంచే బాలురలో మహిళలపట్ల గౌరవభావం పెంచేవిధంగా మన విద్యావ్యవస్థను రూపొందించుకోగలిగితే, కనీసం తరువాత తరం మహిళలకైనా సమాజంలో సముచిత గౌరవం లభిస్తుంది. ఇటువంటి దారుణమైన ఘటనలు తగ్గే అవకాశం ఉంటుంది.


Related Post