జగన్ మరో సంచలన నిర్ణయం

July 10, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, “గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో 1,513 మంది రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ గత ప్రభుత్వం వారిలో కేవలం 391 మంది కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించింది. కనుక మిగిలిన 1,122 మంది రైతు కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. తక్షణమే వారి రికార్డులను ఒకసారి పరిశీలించి వారిలో అర్హులైనవారందరికీ జిల్లా కలెక్టర్లే స్వయంగా వారి ఇళ్లకు వెళ్ళి ఈ నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్ధికసాయాన్ని వారి నుంచి ఎవరూ గుంజుకోకుండా నివారించేందుకు ఒక చట్టం తీసుకువస్తాము. ఎవరైనా బలవంతంగా వారి సొమ్మును తీసుకోవాలని ప్రయత్నిస్తే కటినమైన శిక్షలు పడేలా చట్టంలో నిబందనలు రూపొందిస్తాము. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలి. జిల్లా కలెక్టర్లు, దిగువస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ గ్రామాలలో పర్యటిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకొంటూ రైతులకు, వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు మనమున్నామనే భరోసా కల్పించాలి. ఈవిషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల కోసం ఎవరూ ఎదురుచూడనవసరం లేదు,” అని చెప్పారు.  

అధికారం చేజిక్కించుకోవడానికి మన రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను అమలుచేయడానికే మీనమేషాలు లెక్కిస్తుంటాయి అటువంటిది జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వం హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నా రైతుల కుటుంబాలను కూడా ఆదుకోవాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా అభినందనీయం.


Related Post