మోడీజీ...ఇవేమి మాటలు?

April 30, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ సోమవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని లోక్‌సభ ఎన్నికల తరువాత ఏ క్షణంలోనైనా వారందరూ బిజెపిలో చేరే అవకాశం ఉందని కనుక మే 23 తరువాత మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ఆ భయంతోనే మమతా బెనర్జీ చాలా అసహనంగా ఉన్నారని అన్నారు. 

ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఒక బహిరంగసభలో అదీ..ఎన్నికల కోడ్ అమలులో  ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపక్షపార్టీలన్నీ తప్పు పడుతున్నాయి. కనీసం ఒక్క కౌన్సిలర్ కూడా బిజెపిలోకి వెళ్ళేందుకు సిద్దంగా లేడని తృణమూల్ నేత డేరేక్ ఓ బెరేన్ ఘాటుగా బదులిచ్చారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కూలిపోయేది మమతా బెనర్జీ ప్రభుత్వం కాదని మోడీయే గద్దె దిగిపోబోతున్నారని ఆ భయంతోనే మోడీ ఈవిదంగా మాట్లాడుతున్నారని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చివేయడానికి కుట్రలు చేస్తున్నారని నరేంద్రమోడీ స్వయంగా చెప్పుకొన్నారని చంద్రబాబు అన్నారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను ఎన్నికల కమీషన్ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షపార్టీలు కోరుతున్నాయి.


Related Post