తొలిరోజే లక్ష్మణ్ దీక్ష భగ్నం!

April 29, 2019


img

తెలంగాణ ఇంటర్ బోర్డులో జరిగియ అవకతవకలను నిరసిస్తూ విద్యార్దులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిరవదిక నిరాహార దీక్ష చేప్పట్టారు. కానీ దీక్షకు కూర్చోన్న కొన్ని గంటలలోపే పోలీసులు వచ్చి ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా నీమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

పోలీసుల వైఖరిని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఖండించారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలియజేసేందుకు కె. లక్ష్మణ్ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దానిని భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నీమ్స్ ఆసుపత్రిలోనే కె. లక్ష్మణ్ నిరాహారదీక్ష కొనసాగిస్తారని చెప్పారు. ఆయన దీక్షను భగ్నం చేయడానికి నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోను కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని చేపపారు. మంగళవారం ఉదయం ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమం యదావిదిగా కొనసాగుతుందని దానిలో భారీ సంఖ్యలో బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మే 2న తెలంగాణ రాష్ట్ర బంద్‌ నిర్వహించబోతున్నట్లు మురళీధర్ రావు ప్రకటించారు. ఇంటర్ విద్యార్దుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.


Related Post