వివి ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

April 08, 2019


img

ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపద్యంలో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. టిడిపితో సహా దేశంలో 21 పార్టీలు వేసిన పిటిషనుపై ఇరుపక్షల వాదనలు విన్న తరువాత, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో 35, అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వివి ప్యాట్లలో పోలైన ఓట్లను లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చి చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

కనీసం 50 శాతం ఈవీఎంలలో ఓట్లను లెక్కించి చూడాలని ప్రతిపక్షాలు కోరగా, అన్ని ఈవీఎంలకు అనుసంధానం చేసిన వివి ప్యాట్లలోని ను లెక్కించాలంటే ఫలితాలు వెల్లడించడానికి కనీసం మరో ఆరు రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. కానీ ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగేందుకు దోహదపడే ఈ చర్యవలన ఫలితాలు కాస్త ఆలస్యంగా ప్రకటించినా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రతిపక్షాల తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించినప్పటికీ 35 శాతం వివి ప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందని తేల్చి చెప్పింది. కనుక ఇకపై ప్రతీ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో 35, అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వివి ప్యాట్లలో పోలైన ఓట్లను లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చి చూడవలసి ఉంటుంది. ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక వివి ప్యాట్ యంత్రంలో మాత్రమే లెక్కిస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది.


Related Post