టువర్డ్స్ గోల్డెన్ తెలంగాణ...

April 06, 2019


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని రంగాలలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని, మార్పులను చూస్తున్నప్పుడు, రాష్ట్రం ఏర్పడక మునుపు పరిస్థితులు అందరూ ఒక్కసారైనా తలుచుకోకుండా ఉండరు. పాలకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలనే తపన, పట్టుదల, చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నట్లయితే రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి జరుగుతుందో తెలుసుకొనేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష ఉదాహరణగా కళ్లెదుట నిలిచి ఉంది. అంటే తెలంగాణ కోసం ప్రజలు చేసిన పోరాటాలు, యువకుల బలిదానాలు వృధాకాలేదని స్పష్టం అవుతోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యత, వ్యవసాయం, రైతుల కష్టాలు..విద్యుత్ అవసరాలు, పారిశ్రామిక స్థితిగతులు...ఇలా ప్రతీ విషయం గురించి సమగ్రమైన అవగాహన, వాటిని ఏవిధంగా పరిష్కరించాలనే దూరదృష్టి కలిగి ఉండటం, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు అంశాలపై లోతైన అవగాహన, ఆ సమస్యలను పరిష్కరించాలనే పట్టుదల కలిగి ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమేనని చెప్పవచ్చు. 

ఒకవేళ కేసీఆర్‌కు బదులు వేరెవరైనా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయుంటే నేడు రాష్ట్రం ఏవిధంగా ఉండేదో అని ఊహించుకొంటేనే భయం కలుగుతుంది. తెలంగాణ ప్రజలు సరైన వ్యక్తిని అన్నుకోవడం వలననే రాష్ట్రం ప్రగతిపధంలో పరుగులు తీస్తోందని చెప్పక తప్పదు. 

గత 5 ఏళ్ళలో బంగారి తెలంగాణ కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమపధకాల గురించి అందరికీ తెలుసు. వాటి గురించి వివరిస్తూ “టువర్డ్స్ గోల్డెన్ తెలంగాణ” అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె. జోషి శుక్రవారం సచివాలయంలో దానిని విడుదల చేశారు. అన్ని రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి గణాంకాలతో సహా దానిలో వివరించబడింది. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేవలం 5 ఏళ్ళలో ఇంత అభివృద్ధి జరిగినప్పుడు రాగల 5 ఏళ్ళలో మరింకెంత అభివృద్ధి చెందుతుందో ఊహకు అందని విషయమే. కనుక ఈ ఉగాది పండుగతో రాష్ట్రంలో మరో నూతన అధ్యాయం మొదలైనట్లే భావించవచ్చు. 


Related Post