అక్కడ బ్యాలెట్ ఎన్నికలే: రజత్‌కుమార్‌

March 28, 2019


img

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన తరువాత 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 443 మంది బరిలో మిగిలినట్లు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది, అత్యల్పంగా మెదక్ నుంచి 10 మంది  అభ్యర్ధులు బరిలో మిగిలినట్లు తెలిపారు. నిజామాబాద్‌లో బరిలో మిగిలిన అభ్యర్ధులలో 178 మంది పసుపు, ఎర్రజొన్న రైతులేనని రజత్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌లో కేవలం నలుగురు మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకొన్నారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నిజామాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న తెరాస సిట్టింగ్ ఎంపీ కవితకు ఇది చాలా ఇబ్బందికరమైన విషయమేనని చెప్పవచ్చు. 

నియోజకవర్గాల వారీగా బరిలో మిగిలిన అభ్యర్ధుల సంఖ్య:    

1. ఆదిలాబాద్‌: 11

2. పెద్దపల్లి: 17

3. కరీంనగర్‌:  15

4. నిజామాబాద్‌: 185

5. జహీరాబాద్‌: 12

6. మెదక్‌: 10

7. మల్కాజ్‌గిరి: 12

8. సికింద్రాబాద్‌: 28

9. హైదరాబాద్‌: 15

10. చేవెళ్ల: 23

11. మహబూబ్‌నగర్‌: 12

12. నాగర్‌కర్నూలు: 11

13. నల్గొండ: 27

14. భువనగిరి: 13

15. వరంగల్‌: 15

16. మహబూబాబాద్‌: 14

17. ఖమ్మం: 23


Related Post